యజ్ఞదీక్ష వహించి అపహరించబడెను
తన యజ్ఞాశ్వమునకై కుమారుల ద్వారా
ఒక పెద్ద సముద్రమును త్రవ్వించెను
ఆ సగరునకు అసమంజుడను
దుర్మార్గుడైన పుత్రుడు యుండెను
అతడు పాపకర్మలు చేయుట వలన
సగరుడు అతనిని దేశము నుండి వెళ్ళగొట్టెను
అసమంజునిసుతుడు అంశుమంతుడు
అతని కుమారుడు దిలీపుడు
దిలీపుని సుతుడు భగీరథుడు
అతని పుత్రుడు కకుత్ స్థుడు జన్మించెను
కకుత్ స్థుని కుమారుడు రఘు మహారాజు
రఘుమహారాజు సుతుడు కల్మాషపాదుడు
అతడు పెరిగి పెద్దవాడై శాపగ్రస్తుడై
నర మాంసభక్షకుడయ్యెను
కల్మాషపాదుని సుతుడు శంఖణుడు
యుద్ధమున అతడు అతని సైనికులు నశించిరి
శంఖుణి పుత్రుడు సుదర్శనుడు
సుదర్శనుని కుమారుడు అగ్నివర్ణుడు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి