111 (2): - ఎడ్ల లక్ష్మి -సిద్దిపేట


వసిష్టమహర్షి చెప్పిన మాటలు విని 
శ్రీరాముడు ఆ మహర్షితో ఇట్లు నుడివెను
తల్లిదండ్రులు తమ సంతానమును
ప్రాణమెత్తుగా వారు పెంచెదరు. 

తల్లిదండ్రులు తమకు చేసిన సేవలకు 
రుణము తీర్చుకొనుట ఎవరికైనను అసాధ్యము 
మా తండ్రి దశరథ మహారాజు 
జన్మనిచ్చి సత్యవచనములను నేర్పినాడు 
 
తండ్రి నాకిచ్చిన ఆదేశము వమ్ముకారాదు.
శ్రీరాముని మాటలు వినిన భరతుడు 
నిస్పృహకు లోనై మిక్కిలి దుఃఖిస్తూ
రాముడు అయోధ్యకు వచ్చువరకు 

నేను ఇచ్చటనే నిరాహార దీక్షను చేసెదను 
దర్భాసనమును తెప్పించుకుని 
భరతుడు దానిపై కూర్చొని యుండెను 
మహాతేజస్వియు  ఐన శ్రీరాముడు చూసి

నాయనా! భరతా! నీవు నన్ను అడ్డగించుటకు 
నేను నీకు చేసిన అపకారమేమి? 
అన్యాయం చేసిన వారిని అడ్డగించిన 
ఉత్తమమైన ఫలితము ఉంటుంది.

కామెంట్‌లు