భరతుడు నిరాహార దీక్షకు సిద్ధపడుట - శ్రీరాముడు సముదాయించుట
కుకత్ స్థవంశశిరోమణీ! రఘునందనా!
ప్రతి వ్యక్తికి తల్లి, తండ్రి గురువు అను
ముగ్గురు గురువులుందురు ఇది సత్యము
తల్లిదండ్రులు మొదటి గురువులు
సకలశాస్త్రములను బోధించి
జ్ఞాననేత్రమును ప్రసాదించిన ఆచార్యుడు
తల్లిదండ్రుల కంటే శ్రేష్టుడు గురువు
ఓ రామా! నేను నీకే కాదు నీ తండ్రికి గురువును
నాయనా! రామా! సభా సదులు, బ్రాహ్మణులు
పౌరజనులు ఇచ్చటికి చేరియున్నారు.
వీరిని పాలించుట నీ ధర్మము.
మీ తల్లి మాటను కాదనుట తగదు
రామా! ఆమె మాటను పాటింపుము
ఓ రామా! నిన్ను వేడుకొనుచున్నాను
భరతుని పలుకులను మన్నింపుము.
క్షత్రియులకు ప్రజల పాలనే ధర్మము
నీవు ఆ ధర్మమును ఆచరించినచో
నీ స్వధర్మమును పాటించుటయే గాక
సంప్రదాయమును కాపాడిన వాడవవుతావు

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి