జటాధారినై నారచీరలను ధరించియుందును
వీరుడవైన ఓ రఘువర! ఫలములను
కందమూలములను భుజించెదను.
మీ రాకకై నిరీక్షించుచూ నగరమునకు
వేలుపలిభాగమున ఉందును
ఓ అగ్రజా!ఈ పదునాలుగు సంవత్సరములవరకు
కోసలదేశము! రాజ్య పాలన భారమును
నీ పాదుకల మీదనే ఉంచెదను
పదునాలుగు సంవత్సరముల పిదప
నీ దర్శనము కానిచో
అగ్నిప్రవేశము చేసెదను
శ్రీరాముడు భరతునకు తన ఆమోదమును తెలిపెను
ఆ ప్రభువు భరత శత్రఘ్నులకు వీడ్కోలు పలికెను
భరతుడు భక్తితో పాదుకలను పూజించి
శ్రీరామచంద్రునకు ప్రణమిల్లెను
పాదుకలను అలంకరించి అంబారి పై ఉంచెను
శ్రీరాముడు అందరికీ వీడ్కోలు పలికెను
కౌసల్యకు దుఃఖముతో కంఠము మూగబోయెను
శ్రీరాముడు తల్లులందరికి నమస్కరించి
ఏడ్చుచు తన పర్ణశాలకు చేరెను.
======================================
అయోధ్యకాండమందు 112వ సర్గ సమాప్తము.🙏🏻

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి