భరతుని ప్రార్థనపై శ్రీరాముడు తన పాదుకలను ఆయనకు ఒసంగుట
మహర్షులందరూ సంతోసించిరి
ధర్మములను బాగుగా ఎరిగిన
ఆ ఇరువురిని కన్న దశరథుడు ధన్యుడని మురిసిరి
రాముని మాటలు విన్న ఋషిశ్వరులు
భరతునితో ఇలా అంటారు
ఓ భరతా! శ్రీరాముని మాటలు వినుము
అయోధ్యకు తిరుగు ప్రయాణము కమ్ము.
వారి వచనములు విని శ్రీరాముడు సంతోషించి
మహార్షులందరికీ వందనమొనర్చెను
భరతుడు గజగజ వణుకుచు
శ్రీరామునితో ఇలా అంటాడు
ఓ శ్రీరామ! ఈ రాజ్యభారమును
స్వీకరించి దానియౌన్నత్యమును నిలబెట్టుము.
ప్రజా పాలనలో నీవు సమర్ధుడవు
భరతుడు ఈ విధముగా పలికి
అన్నగారి పాదములపై వ్రాలెను.
శ్రీరాముడు భరతుని లేవనెత్తి ఒడిలోకి చేర్చుకొని
నాయనా! భరతా! నీ బుద్ధి వినయము శోభితము.
ఇట్టి బుద్ధిబలముగలవాడు
సమస్త భూమండలమును ఏలగలడు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి