ఇట్లు నుడివెను
ఓ రామా! బంగారముతో తాపబడిన
నీ యీ పాదుకలను భరతునికి ప్రసాదింపుము
కోసలదేశప్రజలయోగక్షేమములను జూచును
వసిష్టు మహర్షి ఇట్లు పలికిన పిమ్మట
శ్రీరాముడు పాదుకలను ఒక్కసారి తొడుగుకొని
వెంటనే రాజ్యక్షేమముకై వీటిని నాకు అనుగ్రహించెను
ఈపాదుకలతో అయోధ్యకు వెళ్ళుచున్నాము.
ఓ భరతా! నీలాంటి పుత్రునిగన్న మీ తండ్రి
దశరథమహారాజు అమృతస్వరూపుడు
భరద్వాజముని ఇట్లు పలకగానే
పాదాభివందనము చేసి అతని అనుమతి పొంది
భరతుడు సైన్యంతో పాటు బయలుదేరెను
వారందరూ యమునానదిని దాటి
పవిత్రమైన గంగానదిని మరల దర్శించి
రమ్యమైన శృంగబేర పురమున ప్రవేశించిరి
భరతుడు అచట నుండి బయలుదేరి
తండ్రి సోదరులు లేనట్టి అయోధ్యను దర్శించి
ఓ సుమంత్రా! అయోధ్యపురమును చూడు
దీనావస్థతో నిశ్శబ్దము తాండవిస్తున్నది.
---------------------------------------------------------
అయోధ్యకాండమందు 113వ సర్గ సమాప్తము.🙏🏻

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి