113వ సర్గ : - ఎడ్ల లక్ష్మి -సిద్దిపేట
చిత్రకూటమి నుండి బయలుదేరిన భరతుడు 




భరతుడు పాదుకలను తన శిరస్సుపై దాల్చి 
శత్రఘ్నునితో గూడి రథమును ఎక్కెను 
మహర్షులు, మంత్రులు, పురవాసులు
చిత్రకూటపర్వతమునొదిలి వెళ్ళినారు. 

భరతుడు చిత్రకూట పర్వతము నుండి 
కొంత దూరము వెళ్ళిన పిదప 
భరద్వాజాశ్రమమును జూచెను 
అతడు ఆ ఆశ్రమమునకు వెళ్లెను 

భరతుడు మహర్షికి ప్రణమిల్లి నిలిచెను
భరద్వాజమహర్షి భరతుని జూచి సంతసించి 
నాయనా! భరత! శ్రీరాముని దర్శనమైనదా? 
నీ కార్యము సఫలమైనదా తెలుపుము. 

ఓ మహర్షి శ్రీరాముని దర్శనమైనది
దర్శనమైన పిదప గురువు వసిష్ఠుడు నేను 
అయోధ్యకు వచ్చి పాలన చేయుమని 
ఎంతగానో ప్రాధేయపడి అడిగినాము. 

శ్రీరాముడు అందులకు సమ్మతించలేదు 
పదునాలుగు సంవత్సరమల వనదీక్ష 
పూర్తి అయిన పిదపనే వస్తానని అన్నాడు 
తండ్రితో చేసిన ప్రతిజ్ఞను తప్పనన్నాడు.

కామెంట్‌లు