114వ సర్గ : - ఎడ్ల లక్ష్మి -సిద్దిపేట
భరతుడు అయోధ్య నగరమున ప్రవేశించి, కన్నీరు గార్చుట




భరతుడు అయోధ్య నగరమున ప్రవేశించెను 
అచట పిల్లులు గుడ్లగూబలు, సంచరించుచుండెను 
మానవుల కదలిక తగ్గిపోయెను 
అయోధ్య శోభవిహీనమై యుండెను 

శ్రీరాముడు అడవుల పాలగుట వలన 
అయోధ్య వెలవెలబోవుచుండెను 
ప్రభువును కోల్పోయిన అయోధ్య 
పెక్కు చిక్కులపాలై యుండెను.

శ్రీరాముని ఎడబాటనకు గురి అయిన అయోధ్య,
దుస్సాహాసమైన వేదనతో కుమిలిపోవుచున్నది 
శ్రీరాముని ఎడబాటునకు లోనైన
ఆ అయోధ్య శోభవిహీనమైయున్నది. 
 
ఇప్పుడు అయోధ్యలోని ప్రజలందరు 
దూకితులైయున్నందున రాజవీధులయందు
జన సంచారము లేక బోసిపోయినది
వ్యాపారుల కొట్టులన్ని మూసివేసి యున్నవి 

కైకేయి వరముల దాటికి అయోధ్య 
చిన్నా భిన్నమై ఒప్పుచుండెను 
మేఘాలు గప్పిన సూర్యకాంతి వలె 
అయోధ్య వేలవేలబోవుచుండెను. 

కామెంట్‌లు