115 ( 2 ): - ఎడ్ల లక్ష్మి -సిద్దిపేట


భరతుడు రథమను సిద్ధము చేయమనగా
సారథి గజరథమును సిద్ధపరిచెను
భారతసత్రఘ్నులు తల్లులకు నమస్కరించి
వారిరువురు పరమప్రీతితో రథమునెక్కిరి

మంత్రులతో, పురోహితులతో గూడి
నందిగ్రామమునకు బయలుదేరి
వేగిరముగా నందిగ్రామమునకు చేరిరి
రథము నుండి భరతుడు చకచకా దిగెను 

భరతుడు గురువులతో ఇలా అంటాడు 
పూజ్యులరా! మా అన్న స్వయముగా 
ఈ రాజ్యము నాకు అప్పగించినాడు 
ఈ బంగారుపాదుకలను నాకిచ్చినాడు

ఆ పాదుకలను వింజామరలతో విసురుతూ
ఇవి ప్రజల యోగక్షేమములను రక్షిస్తూ 
రాజ్యధర్మము సుస్తీరముగా యుంచును
శత్రువుల బారి నుండియు కాపాడును
 
భరతుడు శ్రీరాముని రాకకై నిరీక్షించుచు  
శ్రీరాముని ఆజ్ఞను అనుసరించుచు 
తన ప్రతిజ్ఞను నిలబెట్టుకొనుచుండెను 
పాదుకలకు పట్టాభిషేకమొనర్చి
మిక్కిలి దుఃఖితుడై ఏడ్చుచుండెను.

===================================

అయోధ్యకాండమందు 115 వ సర్గ సమాప్తము.🙏🏻
కామెంట్‌లు