నివసించునప్పటినుండియు
రాక్షసుల ఆగడములు మితిమీరినవి
అందుకని తాపసులు భయపడుచున్నారు.
రావణుని తమ్ముడగు ఖరుడను రాక్షసుడు
ఈ వనము నందు నివసించుచున్నాడు
మునులను పెక్కు రేతిన బాధిస్తున్నాడు
అతడు నీ ఉనికిని గూడా సహించుటలేదు.
ఓ రామ! మీరు ఈ ఆశ్రమమునకు
వచ్చినప్పటినుండి ఆ రాక్షసులు
తాపసులను మిక్కిలి బాధించుచున్నారు.
వారి రూపాలు రోత పుట్టిస్తున్నాయి.
ఆ రాక్షసులు మునుల ఎదుట నిలిచి
అపవిత్రమైన పదార్థములను వారిపై
చల్లుచూ భయంకరముగా అరుస్తున్నారు
కొందరి మునులను హతమారుస్తున్నారు
మునీశ్వరులు యజ్ఞ కార్యములను
ప్రారంభించగానే వారు అచటికి చేరి
హోమ సామాగ్రిని చిందర వందర చేస్తూ
నీటితో హోమాగ్నులను చల్లార్చుచున్నారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి