ఆశ్రమములను విడచిపెట్టి వెళ్ళుటకు
ఆ మునులు నన్ను ఒత్తడి చేయు చున్నారు
మేము ఈ ఆశ్రమమును వదిలి వెళ్ళెదము.
ఓ రామా! ఇచ్చటికి కొంత దూరములో
ప్రాచీనమైన వనముగలదు ఆ ప్రదేశమున
కందమూలములు, ఫలములు
పుష్కలముగా లభించును కనుక మేము
అచ్చటి ఆశ్రమమునకు వెళ్ళేదము.
ఓ మహార్షీ! మీరు ఎక్కాడికీ వెళ్లకూడదు
మీకు అండగా మేమిరువురము ఉన్నాము
మిమ్ములను నేను రక్షించెదను
నేనుండగా మీకు భయమెందుకు?
శ్రీరాముని అభినందించి ఆ మహార్షి
తోటి మహర్షులతో కూడి వెళ్ళిపోయెను
శ్రీరాముడు కొంత దూరము వారితో నడిచి
తిరిగి తమ పర్ణశాలకు వెళ్లినాడు.
శ్రీరాముని ఆశ్రమము మునులతో నిండి ఉండేది
ఋషులు ఆ ప్రదేశమును వదిలి వెళ్ళినారు
శ్రీరాముని గుణగణములను అతని రూపమును
వారి హృదయము నిండా నింపుకొని పోయినారు.
===============================
అయోధ్యకాండమందు 116 వ సర్గ సమాప్తము.🙏🏻

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి