సీతాదేవి అనసూయ లోనికి వెళ్ళగానే
తపస్సినియగు అనసూయాదేవి గూర్చి
మహర్షి శ్రీరామునికి ఇట్లు వివరించును
"ఓ పుణ్యాత్ముడా! ఒక సమయమున
పదిసంవత్సరములు వర్షములు కురియక
లోకమంతయు కరువు కాఠకమొచ్చెను.
ప్రజలకు తినుటకు తిండి త్రాగుటకు నీరులేక
మలమలమాడిపోయిరి అప్పుడు ఈ అనసూయాదేవి
కఠోరమైన నియమముతో తపస్సుజేసి
తనతపప్రభావముచే కందమూలములను
సృష్టించి, గంగా నదిని ప్రవహింపజేసేను.
లోకములో ఆకలి దప్పులను తీర్చెను
పదివేల సంవత్సరములు తపస్సుజేసి
ఋషీశ్వరుల విఘ్నములను తొలగించెను
ఈమె సమస్త ప్రాణులకు పూజ్యురాలు.
కోపమెరుగని శాంతిమూర్తిగా కీర్తి గాంచెను
ఈమె అసూయ లేనిదిగా ప్రసిద్ధిగాంచినది
విదేహనందినియైన సీతాదేవి.
ఈమెను అనుసరించుచుండునుగాక.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి