\శ్రీరాముడు సీతాలక్ష్మణసహితుడై అత్రిమహర్షి ఆశ్రమమునకు చేరుట
శ్రీరాముడు ఎన్నో విధముల ఆలోచించుచుండెను
అనేక కారణముల వలన అక్కడ నివసించుటకు
ఆయనకు సమ్మతము గాకుండెను.
భరత సేనశిబిరమిచ్చటనే ఏర్పాటు చేయుట వలన
గజముల పేడలతోడను గుర్రముల లద్దితోడను
ఆ ప్రదేశమంతయు అపవిత్రమైనది
శ్రీరాముడచట యుండుటకు ఇష్టపడలేదు.
శ్రీరాముడు సీతా లక్ష్మణులతో గూడి
అచ్చటి నుండి బయలుదేరెను
రాఘవుడు అత్రిమహాముని
ఆశ్రమమునకు చేరి మహార్షికి ప్రణమిల్లెను
ఆ ముని శ్రీరాముని తన పుత్రుని వలె ఆదరించెను
అప్పుడు అత్రిమహాముని శ్రీరామునకు
స్వయముగా అతిథిసత్కారములను నెరిపెను
లక్ష్మణుని, సీతాదేవిని చక్కగా ఓదార్చేను.
అత్రిమహర్షి పత్ని అనసూయదేవి
అచటికి విచ్చేయగా ఆముని ఆమెను
సగౌరవముగా ఆహ్వానించెను
ఆమె సీతారామలక్ష్మణులను ఓదార్చెను.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి