118. ( 2 ): - ఎడ్ల లక్ష్మి -సిద్దిపేట


సీతాదేవి నుండి వినిన పలుకులకు 
అనసూయ దేవి ఎంతో సంతోషించెను 
ఆమె మూర్ఖమును ఆమె తెలుసుకొని 
సీతతో ఆమె ఇలా పలుకుచుండెను.

ఎల్లప్పుడూ చిరునవ్వుతో ఉండే ఓ సీతా! 
నా తపశక్తినుండి నీవేమి కోరిన ఇయ్యగలను.
కనుక నీవు ఒక వరమును కోరుకొనుము.
నీవు పలికిన మధురవచనములకు

నేను మిక్కిలి సంతృప్తి చెందితిని 
నీకు ఇష్టమైన కోరికను కోరుకొనుము 
నీ కోరికను నేను తప్పక తీర్చెదను
అనసూయదేవి నుడివిన మాటలు విని 

సీతాదేవి మిక్కిలి ఆశ్చర్యపడును 
అప్పుడు ఆమె దరహాసము చేయుచు 
తపోబల ప్రసన్నరాలైన అత్రిపత్నితో 
మీ మధుర వచనములతోడనే

నా కోరికలన్నీ ఈడేరినవి నా కొరకు మీరు 
చేయవలసినది ఏమియు లేదని పలికెను .
ఓ సీతా! ఏమి కోరని నీ   నిండుదనమునకు
నేను పరమానంద భరితురాలనైతిని 

కామెంట్‌లు