వస్త్రాభరణములు, అంగరాగములు
అమూల్యమైన మైపూతలు దివ్యములైనవి
ఇవి నీ శరీరమునకు తగినట్లు యున్నవి.
ఇవి ఏమాత్రము వసివాడక సర్వదా
దర్శనీయములై యుండును తల్లీ!
వీటన్నింటినీ నీకు ఇచ్చెదను తీసుకొనుము
వీటితో నీ భర్తను సంతోష పరచగలవు.
సీతాదేవికి, ప్రీతి పూర్వకముగా ఇచ్చిన
వస్త్రాభరణములను, అంగరాగములను,
నగలను ఆమె నుండి స్వీకరించెను
సీతాదేవి కానుకలను గ్రహించిన పిమ్మట
అనసూయదేవిని భక్తి శ్రద్ధలతో సేవించెను
ఓ సీతా! వాసిగాంచిన ఈ శ్రీరాముడు
స్వయంవరం సభలో నిన్ను అర్ధాంగిగా
పొందినట్టు నేను వింటిని ఆ కథను తెలుపుము
సీతాదేవి తమ కథను ఆమెకు వివరించును
మిథిలానగర ప్రభువు జనకమహారాజు
యజ్ఞము చేయుగోరి ఆ క్షేత్రమును
మేడి కర్ర పట్టుకొనినాగలితో దున్నసాగెను
అప్పుడు నేను భూమిని చీల్చుకొని వచ్చితిని
నా శరీరమంతాదుమ్ముతో యుండెను
నన్ను చూసిన ఆ జనక మహారాజు
మిక్కిలి తోసంతోషపడుచుండెను

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి