118. ( 4 ): - ఎడ్ల లక్ష్మి -సిద్దిపేట


జనకునికి సంతతి లేకపోవుటచే 
ఆ మహారాజు ప్రేమతో నన్ను ఎత్తుకొనెను 
ఆమె నా కూతురే అని అతడు తెలిపెను
అతని గుండెలోని ప్రేమను నాపై ఒలికించెను 

ఇంతలో ఆకాశము నుండి ఒక దివ్యవాణి 
నన్ను గూర్చి మా తండ్రికి తెలిపెను
ఓ రాజా! ఈమె మనుష్యబాలిక కాదు. 
దివ్య శిశువు ఈమె ధర్మముగా నీ కూతురే

దివ్య వచనములను విన్నపిమ్మట 
నన్ను రాజభవనమునకు తీసుకపోయెను 
మహారాజు సంపదలు కొల్లలుగా వృద్ధి చెందెను 
నన్ను అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేసెను.

జనకుని కంటే పూర్వుడైన దేవరాతుడు 
ఒక మహా యజ్ఞము చేయుచుండగా 
మహాత్ముడైన శివుడు ప్రసన్నుడై 
ఒక ధనస్సును రెండు తూణీరములను

ఆ మహారాజునకు అనుగ్రహించెను 
క్రమముగా ఆ ధనస్సు మా తండ్రియైన
జనక మహారాజుకు సంక్రమించెను 
అట్టి ధనస్సును ఎవ్వరు కదిలించలేరు. 

కామెంట్‌లు