118 (5 ): - ఎడ్ల లక్ష్మి -సిద్దిపేట


మా తండ్రి జనక మహారాజు యోచించి 
ఆ ధనసు నెత్తిన వారికి నా కూతుర్ని ఇస్తానని 
సంతోషముతో స్వయంవరము 
ప్రకటించాడు
ఎందరో రాజులు విచ్చేసి వెళ్ళినారు 

కొందరు ధనస్సు నెత్తలేక దండము పెట్టారు 
ఇది జరిగిన చాలా కాలమునకు 
రఘువరుడు లక్ష్మణునితో గూడి
విశ్వామిత్రుని వెంట యజ్ఞము చూచుటకై 

వారు మిథిలా నగరము వచ్చినారు 
ధర్మనితుడైన మా తండ్రి వారికి 
అతిథి మర్యాదలను ఒనర్చెను
విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణులను 

దశరథుని పుత్రులుగా జనకునికి వివరించెను
వీరు శివధనస్సును చూచుటకై వచ్చినారు 
ఆ దివ్య ధనసును శ్రీరామునికి చూపుము 
విశ్వామిత్రుడు ఇట్లు పలికిన వెంటనే 
 
ఆ ధనస్సును అచటికి చేర్చినారు 
పరాక్రమశాలి అయిన శ్రీరాముడు 
రెప్పపాటు కాలంలో ఆ ధనస్సును వంచి 
అల్లే త్రాడును సంధించి బలముగా లాగాడు.

కామెంట్‌లు