118 ( 6 ): - ఎడ్ల లక్ష్మి -సిద్దిపేట


శ్రీరాముడు వింటినారిని లాగుచుండగానే 
ఆ శివధనస్సు మధ్యకు విరిగిపోయెను
అచ్చటనే అది రెండు ముక్కలయ్యెను
ధనుర్భంగమైనప్పుడు పిడుగుపాటు వలె 

భయంకరమైన ధ్వని వెలువడెను
పిమ్మట ఆడిన మాట తప్పని మా తండ్రి 
నన్ను శ్రీరామునికి ఇచ్చి వివాహమొనర్చుటకు
నిశ్చయించుకొని జలపాత్రను గ్రహించెను 

మా తండ్రి జనక మహారాజు దశరథ రాజును
మిథిలకు పిలిపించి అతిథి మర్యాదలు జేసి
మామగారి అనుమతిని తీసుకొని
శ్రీరామునితో నా వివాహము జరిపించెను. 

మిక్కిలి సౌందర్యవతి, సాద్వియు అగు 
నా చెల్లెలు ఊర్మిలను లక్ష్మణులకు ఇచ్చి 
మా తండ్రి స్వయంవరము జరిపించెను 
శ్రేష్టుడైన నా పతికి నేను సహధర్మచారినైతిని.

=======================================

అయోధ్యకాండమందు 118 వ సర్గ సమాప్తము.🙏🏻
కామెంట్‌లు