అనసూయదేవి సీతాదేవికి వస్త్రాభరణములను కానుకలుగా సమర్పించుట
అనసూయ దేవి ఆమెకు తెలిపిన
ధర్మవచనాములను గౌరవించుచు
ఆమెతో సీతాదేవి ఇట్లు పలుకుచుండెను .
ఓ దేవి! నీవు స్త్రీలందిరిలో సర్వశ్రేష్టురాలవు
నీవిట్లు పలుకుట ఆశ్చర్యకరముగాదు
స్త్రీకి పతియే దైవమని నేనెరుగుదును
అనసూయదేవి నీ సహనానికి వందనాలు.
ఓ పూజ్యురాలా! భర్త గుణహీనుడైనను
గుణవంతుడైనను ఎట్టి సంకోచము లేకుండా
సతికి పతి సేవింపదగినవాడే
నా భర్త శ్రీరాముని గూర్చి చెప్పవలసిన పనిఏమి?
దృఢమైన అనురాగము గలవాడు
శ్రీరాముడు పితృభక్తి గలవాడు
అతడు అత్యంత ప్రేమస్వరూపుడు
ఆయనను భక్తిశ్రద్ధలతో సేవించెదను
ఓ ధర్మాత్మురాల నీవు నాతో పలికిన మాటలు
మా అత్తగారు, మా తల్లి తెలిపిన పలుకులు
నాకు మరొక్కసారి జ్ఞప్తికి వస్తున్నాయి
పతిని సేవించుటయే స్త్రీకి గొప్ప తపస్సు

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి