అమ్మా! సీతా! నేనిచ్చిన దివ్య వస్త్రములను
ఆభరణములను నా ఎదుటనే అలంకరించుకొనుము
అలంకరణములతో శోభిల్లుచున్న
నిన్ను జూచి ఎంతో ఆనందించెదను.
సీతాదేవి వస్త్రాభరణములను అలంకరించుకొని
అనసూయాదేవికి శిరసా ప్రణమిల్లెను
అనంతరము శ్రీరాముని చెంతకు చేరెను
శ్రీరాముడు అలంకృతయై యున్న సీతను జూచెను.
అనసూయ దేవి ఇచ్చిన కానుకలను గాంచి
అతడు ఎంతయో సంతోషించెను.
మిథిలాపతి అయిన జనకుని కూతురు
తపస్వినియైన అనసూయ దేవి వాత్సల్యముతో
తమకు ఇచ్చిన కానుకలను శ్రీరామునికి చూపించెను
మానవులకు ఎవ్వరికి లభించని విధముగా
సీతాదేవికి జరిగిన సత్కారములను గాంచి
శ్రీరాముడు, లక్ష్మణుడు ఆనందించిరి.
ఆ పవిత్రరాత్రి సీతారామ లక్ష్మణులు
ఆ ఆశ్రమమునందే హాయిగా గడిపినారు
ఆ రాత్రి గడిపిన పిమ్మట వారందరూ
ప్రాతః కాలమునందు నిద్రలేచినారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి