119 ( 3 ): =- ఎడ్ల లక్ష్మి -సిద్దిపేట



వనవాసులైన సీతారామ లక్ష్మణులు 
స్నానాధికములను ముగించుకొని 
హోమ కార్యములను ఆచరించి
అత్రిమహర్షికి, ఆయన పత్నికి ప్రణమిళ్ళిరి 

రామలక్ష్మణులు తమ ప్రయాణమునకై 
ఆ మహర్షిని అనుమతిని గోరిరి
ఆ ముని దంపతులు వారితో ఇలా పలికిరి 
వనమున క్రూర మృగములు, రాక్షసులు ఉందురు 

మీరు వనమునందు గమనిస్తూ వెళ్ళుము
ఓ శ్రీరామా! ధర్మనీతులైన తాపసులు 
యజ్ఞంలో ఉండగా రాక్షసులు బాధించెదరు 
వారికి నీవు రక్షణగా యుండి కాపాడుము 

ఓ రఘురామా! మహర్షులందరు 
కందమూలములకై ఈ మార్గముననే వచ్చెదరు 
కావున నీవును ఈ దుర్గమారణ్యమును 
ప్రవేశించుటకు ఇదియే తగిన మార్గము 

తపస్సంపన్నులైన బ్రహ్మనోత్తములు అంజలి ఘటించి 
వారికి శుభాశీస్సులు పలికిరి 
శ్రీరాముడు సీతా లక్ష్మణులతో గూడి
వెలిగే సూర్యుని వలె దట్టమైన వనమున ప్రవేశించిరి. 


అయోధ్యకాండమందు 119 వ సర్గ సమాప్తము.🙏🏻

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
కామెంట్‌లు