త్యాగరాజు రామదర్శనం 13వభాగం: - మూలం...డా.ములుకుట్ల బ్రహ్మానందశాస్త్రి- సేకరణ...అచ్యుతునిరాజ్యశ్రీ


 రాముడు భాగవతార్ రెండో కొడుకు కుప్పుస్వామి భాగవతార్ 40వ ఏట చనిపోయాడు.రాముడికి ముగ్గురు కూతుళ్లు.అందులో ధర్మాంబకు  శ్రీనివాసయ్య అనే కొడుకు తిరువయ్యూర్ త్యాగరాజ స్వామి గుడి పూజారి( ఈపుస్తకం 1987లో అచ్చయింది.ప్రతులు 1200   మూల్యం 50రూపాయలు!!)
రాముడు రెండో కొడుకు కుప్పుస్వామి భాగవతార్ కి ముగ్గురు కూతుళ్లు.ఇతని భార్య వెంగలక్ష్మి. ఈమె అమ్మాపేటలో కూతురు దగ్గర ఉంది.1966లో తమ వాటాను ప్రసిద్ధ సంగీత విద్వాంసుడైన మహారాజపురం విశ్వనాధయ్యర్ కి అమ్మేసింది( ఈయన గాత్రం రేడియోలో అప్పుడప్పుడు విన్పడుతుంది ఉదయం 8.30కి ప్రసారమయ్యే సంగీత ప్రోగ్రాంలో)
త్యాగయ్య అన్న జప్యేశుడుకి
 పుత్ర సంతానం లేదు.మహారాజపురం తను కొన్నదాన్ని  అరుణాచలయ్యర్ కి అమ్మేశారు.   త్యాగయ్య వాటాను రామానుజయ్యర్ కొన్నాడు.1952లో ఆయన త్యాగబ్రహ్మ ఆరాధన సభకు అమ్మాడు. దీనికి 2ఫర్లాంగులదూరంలో బెంగుళూర్ నాగరత్నమ్మ  కట్టించిన త్యాగరాజ ఆలయం( దేవుని పేరు) ఉంది. 
1810  లో త్యాగయ్య తల్లి సీతమ్మ కాలంచేసింది.త్యాగయ్య జీవిత విశేషాలు  చాలావరకు అందించిన వారు శ్రీ సాంబమూర్తిగారు ఆంగ్లంలోరాశారు.1810లో పెద్దన్న దుష్టబుద్ధితో భోగిపండుగరోజు  తమ్ముడు త్యాగయ్య ను,మరదలును ఇంటినుంచి వెళ్లగొట్టి, మండుటెండలో నిలబెట్టాడు. తిరువయ్యూర్ జనాలు జాలిచూపారు. ఆఊరి తాసిల్దార్ శ్యామలరావు చొరవ చేసి,అన్నకి ఇంటిలో దక్షిణ భాగాన్ని,త్యాగయ్య కి ఉత్తరభాగం ఇచ్చి మధ్య లో గోడకట్టించాడు. ఏకపీఠవిగ్రహంని త్యాగయ్య కి ఇచ్చాడు." ఎంతభాగ్యమో మా పాల కల్గితివి ఎవ్వరీడు ముజ్జగములలో" అని పాడారు త్యాగయ్య. కుళ్లు జనాలు త్యాగయ్యపై నిందవేశారు" నీకు ఆదాయం బాగా ఉంది" అని!!??"
" నాదుపై బలికేరు నరులు శ్రీరామ...పంచశరజనక ప్రపంచమున గల సుఖము మంచు వలె ననుచు మదినెంచితి గాని" అనికీర్తనరూపంలో రామునితో మొరపెట్టుకున్నాడు త్యాగయ్య. ఆనాడు ఈనాడు పుల్లలు పెట్టేవారున్నారు.అప్పటికి ఆయన 43ఏళ్లవాడు.ఇంట్లో సరుకులు నిండుకున్నాయి.
కామెంట్‌లు