ఈమెను ఆశించినచో మీరు ప్రాణాలతో మిగులరు
ఈ నారీమని నాకు దక్కుట వలన
నేను మీ ప్రాణములను తీయను
నా మనసు మారకముందే మీరిచ్చట నుండి వెళ్ళుడు
ఆ విరాధుడి మాటలకు శ్రీరాముడు కుపితుడై
కన్నులెర్రజేసి విరాధుడిని ఇట్లనెను
ఓ దుర్మార్గుడా! సద్వంశ స్త్రీని కోరుకొనుట
నీ హీన లక్షణమునకు నిదర్శనము.
ఓ విరాధా! నీ చావును నీవే కోరుకుంటున్నావు
క్షణం ఆగు నా చేతిలో నీకు చావు తప్పదు
శ్రీరాముడు ధనస్సును ఎక్కు పెట్టి
ఏడు ధనస్సుల బాణములను సంధించెను
గరత్మంతుని వలె ఆ బాణములు వేగముగా
విరాధుని శరీరమును చీల్చుకొని నేలపై పడెను
రామ బాణములు తాకిన ఆ రాక్షసుడు
కోపావేశముతో ఊగిపోవుచు
సీతాదేవిని అచటనే వదిలిపెట్టి
వికటట్టాహాసము చేసి ఆవలించుచు
ఒళ్ళు విరుచుకొని అచ్చట ఉండిపోయెను
సోదరులు వేసిన బాణాలు అతని శరీరము నుండి నేలపై రాలేను.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి