శ్రీరామునికి విరాధునికి మధ్య వాగ్వివాదములు
-
నీవు ఎవరు ? ఈ వనమునందు జేరి
ఎందుకు ఇచ్చట సంచరించుచుంటివి?
ఈ అడవి నందు నీకు ఏమి పని యున్నది?
ఆ విరాధుడు లక్ష్మణుని మాటలు విని ఇట్లంటాడు
"ఓరీ! నన్ను ప్రశ్నించుచున్న మీరు ఎవరు?
ఇటు ఎందుకు వచ్చారు? ఎటు వెళ్ళుచున్నారు?
భయంకరమైన రాక్షసుడు వారిని ఇలా ప్రశ్నించగా,
పరాక్రమమాశాలియైన ఆ రఘురాముడు
ఇక్ష్వాకువంశము గూర్చి అతనికి తెల్పెను
మేము క్షత్రియులము సచ్చరిత్ర గలవారము
ఈ దండకారణ్యంలో ఉన్న నీ గూర్చి తెలుపుము.
అప్పుడు విరాధుడు శ్రీరామునితో ఇట్లనెను
" ఓ రాజా! నా స్వరూపము గూర్చి తెలుపెదను
నేను 'జయుడు'అను రాక్షసుని కుమారుడను
రాక్షసులందరు నన్ను విరాధుడని పిలుస్తారు.
నా తపస్సు మెచ్చి బ్రహ్మదేవుడు
నాకు వరమును ప్రసాదించెను
శాస్త్రము లేవియు నన్ను చంపజాలవు
నా శరీరమును ఎవ్వరు చేదింపజాలరు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి