త్యాగరాజు బాల్యంలో తిరువారూరు వీధిబడిలో చదివారు.తండ్రి 1774లో కుటుంబంతో సహాతిరువయ్యూర్ పంచనద క్షేత్రంలో నివాసం ఏర్పర్చుకున్నారు.ఇక్కడ కావేరి,కొల్లెడము, కుడమురతి, వెన్నార్, వెట్టార్ అనే 5నదులు కలుస్తాయి. త్యాగయ్య జీవితమంతా ఇక్కడే గడవటంతో పవిత్ర సంగీత క్షేత్రంగా విరాజిల్లుతోంది.అక్కడ శివుడు పంచనదీశుడు.ఆస్వామిని ప్రణతార్తిహరుడని కీర్తించారు త్యాగయ్య. విద్యాక్షేత్రంగా తిరువయ్యూర్ ఖ్యాతిగాంచింది.కాశీయాత్ర కు బైలుదేరిన తల్లిదండ్రులతో త్యాగయ్య జీవితం పునీతమైంది. పెద్ద కొడుకుల ఆగడాలు భరించలేక బైలుదేరిన ఆదంపతులు తిరువయ్యూర్ లో బసచేశారు.రాజస తామస సాత్విక గుణాలున్న వారితో ఆతల్లిదండ్రులు అక్కడ నివాసం ఏర్పర్చుకోటానికి ఓకారణం ఉంది.శివుడు కలలో కన్పించి" కాశీ కంటే గొప్ప ఈక్షేత్రం. ఇచట సిద్ధిపొందినవారు లింగస్వరూపులవుతారు" అని ఆదేశించాడు.
ఆరోజుల్లో తంజావూరుని పాలిస్తున్న తులసింగమహారాజుకు కలలో పంచనదీశుడు కన్పడి(1765_1787) రామబ్రహ్మంకి ఉండే ఏర్పాట్లు చేయి" అని ఆదేశించాడు. శివుని ఆజ్ఞలేనిదే చీమైనా కుట్టదుగా మరి!?
రాజు రామబ్రహ్మంకి కబురుచేసి శ్రీరామనవమికి 10రోజులు రామాయణ ప్రవచనం చేయమని చెప్పడంతో ఆయన సమ్మతించాడు. అలాగే పశుపతికోవెల అగ్రహారంలోఒక*వేలి* (ఆనాటి 6ఎకరాలకు 3రెట్లు)భూమిని దానంగా ఇచ్చాడు.రామబ్రహ్మంగారు తులసింగు ఆస్థానంలో రామాయణ ప్రవచనంతో అందరి మన్నన పొందారు.🌷
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి