చేసేది లేక నలుగురితో నారాయణ అనిమనసులో అనుకుని మహారాజు వద్ద శలవు తీసుకుని,స్వయంవరం ఏర్పాట్లు ఘనంగా జరిపించటం కోసంతగిన సూచనలు ఇవ్వ వలసిన వారికి ఇస్తూ,యువరాణీ వారికి గట్టి బందోబస్తు బద్రతా ఏర్పాట్లుచేయించి, స్వయం వరానికి విచ్చేసే వారికి తగినవిడిది ఏర్పాట్లుచేయించాడు సుభుద్ది ...!!!విడిది వాకిళ్ళతో ఆసౌరాష్ట నగరం శోభాయమానంగా మారిపోయింది...ఎక్కడెక్కడినుంచో యువరాజులు స్వయంవరాన్ని తిలకించిఅమృతవల్లిని స్వంతం చేసుకోవాలనే ఆతురతతో,సాద్యమైనంత వరకు అన్ని విద్యలలో ఆరితేరినవారై,అందంగా ముస్తాబై అంగరంగ వైభవంగా వేంచేసేరాకుమారుల కోలాహలం చెప్పతరం కాదు.చూడటానికి రెండు కళ్ళూ చాలటంలేదు...!!!ఇక యువరాణి అమృతవల్లి గురించి చెప్పేది ఏమివున్నది.సహజ సౌందర్యరాసి. అనన్య గుణ సంపన్నురాలు. సకల విద్యా పారంగతురాలు .ఆమె కోసంమహారాజు ఏర్పాటు చేయించిన ఉద్యానవనంఒక నందన వనాన్ని తలపిస్తుంది...!!!ఎంతో విస్తీర్ణంతో భూలోకంలో లభించే వివిద రకాల పూల సంపదతో, అందమైన లతా పల్లవాలతో, తటాకాలతో, ఎంతో సౌంధర్యవంతమైనఅద్దాలమేడలతో, పూల లతలతో నిర్మితమైనఅందమైన ఊయలలతో, చుట్టూ నిలువెత్తుప్రాకారాలతో, ఆ గోడలపై చేయివేస్తే గుచ్చుకునేగాజు పెంకుల అమరికలతో, ప్రాకారానికి బయటచుట్టూ నిలువెత్తు కందకాలతో, చూసేవారికి నేలనేఅనుకునేవిదంగా అడుగు వేస్తే ఆగోతిలో పడాల్సిందే...!!!ఆ విధమైన ఏర్పాట్ల మద్య యువరాణీ అమృతవల్లితన చెలికత్తెలతో నిర్బయంగా విహరించే రీతిలోవుండే ఆ అందమైన వుద్యాన వనానికి ఇంకా తగినరక్షణ కలగజేసాడు మంత్రి సుబుద్ది...!!!ఈవిధంగా యువరాణీ అమృతవల్లి హాయిగా ఆడుతూపాడుతూఎన్నో ఆశలు మదిలో నిండగా వివిధదేశాల యువరాజుల చిత్రపటాలను సేకరించిముందుంచగా వారిని తిలకిస్తూ, ఆ చిత్రాలలో వున్నయూవరాజులందరూ విచ్చేసి విడిది గృహాలలోవేంచేశారని తెలిసి సిగ్గుల మొగ్గై, స్వయంవరానికిపూర్తీ సహకారంతో తయారయింది యువరాణిఅమృతవల్లి...!!!**********ఇదిలా వుండగా ఆ సౌరాష్ట్రదేశంలో గుణసేనుడు అనే సాదారణ రైతు వుండేవాడు. అతనికి వున్నకొద్దిపాటి పొలంలో సేద్యం చేసుకుంటూ వున్దదాంట్లో సంతృప్తికరంగా జీవిస్తున్నాడు.అతనికి జయసేనుడుఅనే అందమైన కుమారుడు వున్నాడు...!!!అందంలో గుణంలో ఎంతో ఉన్నతమైన వాడు.చిన్నప్పటి నుండి ఆదర్శ బావాలు కలిగినవాడైసైన్యంలో చేరి రాజ్యానికి సేవచేయాలని ఎంతోఅకాంక్ష కలిగిన వాడైనందున అతని తండ్రిగుణసేనుడు, జయసేనుడికి సకల కళలతో తీర్చిదిద్దాడు. పెరిగి పెద్దవాడై ఒక మంచి వీరుడిగా లోకులలో ఎంతో గణ్యత పొందాడు...!!!అందరికీ సాయపడే మంచి గుణం కలిగిన వాడైఅలరారే వీరుడైన జయసేనుడికి ఓ అందమైన తెల్లనిఅశ్వం వుంది.దానిపేరు కళ్యాణి. జయసేనుడికినమ్మిన బంటు. ఇద్దరూ మంచి స్నేహితులు.కనుసైగతో ఎక్కడికైనా ఆగ మేఘాలమీదతీసుకెళ్ళే సమర్దవంతురాలు.ఆ దేశ యువరాణివారికి స్వయంవరం ప్రకటించగానే తిలకించాలనేఆసక్తితో రాచనగరానికి బయలు దేరాడుజయసేనుడు...(సశేషం) తరువాత బాగం రేపే...
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి