96కోట్లజపం పూర్తయినాక త్యాగయ్య కి రామదర్శనం కల్గి ది.
ఆరామనామ జపంలో రమించాడు. తమ్మునితో కల్సి విశ్వామిత్రుని వెంట వెళ్తున్న రూపం అది.ఆయన ఎక్కడ చెప్పినాడని ఎవ్వరో రామనామ సుఖి ఎవ్వరో, రామనామమనే వరఖడ్గము","ప్రేమ ముప్పిరిగొనువేళ నామమును దలచువారు" అన్న కీర్తనల్లో నామాన్నిగూర్చే చెప్పాడాయన.మంత్రం గూర్చిన ప్రస్తావనలేదు."మనసు స్వాధీనమైన ఆఘనునికి మరి మంత్రతంత్రములేల?" అన్నారు.రామనామం జపించేప్పుడు ఊపిరితీసి వదుల్తూ నామాన్ని సంధిస్తే నిముషానికి 200 సార్లులెక్క!
ఆరభి రాగంలో "నాదసుధారసంలో" నాదసుధారసం అంటే రామనామం నరాకృతి అంటే ఉచ్ఛ్వాస నిశ్వాస రూపం! రామ్ లో ఓంకారం కూడా ఉంది.రామ్ అనే నామం అలా నరాకృతి పొందింది.అలా రామనామ జపం జరిగింది.గంటకు 12వేలు,రోజుకి 6గంటలు జపానికి కేటాయిస్తే 72వేలు అవుతాయి కదా?
1955లో శ్రీ ఎన్.సి.హెచ్.కృష్ణమాచార్యులురాసిన"త్యాగరాజచరిత్ర"లో స్పష్టంగా రాశారు త్యాగయ్య చేసింది రామమంత్ర జపం అని. త్యాగయ్య భైరవి రాగంలో"రామనామము మేలు,రామ చింతన చాలు" ,అఠాణా రాగంలో" రామనామము జన్మ రక్షక మంత్రము,తామసము సేయక భజింపవే ఓ మనసా","సౌరాష్ట్రలో మేలు మేలు రామనామ మీ ధరలోన" అని విశదపరిచాడు. రామనామ జపాన్ని జప్యేశమండపంలోచేశారని శ్రీనారుమంచి సుబ్బారావుగారు రాశారుత్యాగయ్య ఆత్మీయుడు,ప్రధాన శిష్యుడు,మేనత్త కొడుకు శ్రీమానంబుచావడి వెంకట సుబ్బయ్యగారు.పట్నం సుబ్రహ్మణ్యయ్యర్,మహావైద్యనాధయ్యర్ ఈయన శిష్యులు.టైగర్ వరదాచారి,మైసూర్ వాసుదేవాచార్యలు పట్నం వారికి శిష్యులు.మహావైద్యనాధయ్యర్ శిష్యులు సభేశయ్యర్ ..ఈయనశిష్యుడు ముసిరి సుబ్రహ్మణ్యయ్యర్. మనకు ఇప్పుడు కేవలం ముసిరివారి గానామృతం రేడియోద్వారా వినే భాగ్యం కల్గుతోంది🌷
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి