96 కోట్ల రామనామం జపించిన ఏకైక భారతీయ భక్తుడు త్యాగయ్య మాత్రమే! ఆయన జీవితం లో ఇంకో విశేషం 18 అనే సంఖ్య ప్రముఖ పాత్ర పోషించింది. 18వ ఏట పార్వతితో పెళ్లి,రామనామ జపం ప్రారంభం చేసినా రామాయణ కీర్తనలు రాయటానికి సరైన గురువు కోసం అన్వేషణ ప్రారంభించారు.గౌరీమనోహరిలో "గురులేక ఎటువంటి గుణికి, దెలియగబోదు" అని పాడారు అప్పుడే.
ఇక ధన్యాసిరాగంలో ఇలాగురువు గొప్ప తనంగూర్చి పాడారు" నా చిత్తము వంచన చంచలమని నను విడనాడకు శ్రీరామ! గురువు చిల్లగింజ గురువే భ్రమరము, గురుడే భాస్కరుడు,గురువే పరుసవేది".
ఈయన ఆర్తికి సంతసించి రామకృష్ణానంద యతీంద్రులు, నారదమంత్రోపదేశం చేశారు.కొన్నాళ్లకి కాషాయాంబరధారి ఐన ఒక యతీశ్వరుడు వచ్చి త్యాగయ్యను పంచనదీశ్వరుల ఆలయానికి తీసుకుపోయి " ఇది స్వరార్ణవము. సంగీత శాస్త్ర రహస్యాల్ని తెల్పుతుంది." అని నారదీయం అనే పుస్తకాన్ని ఇచ్చారు ఆయన. ఆపై అదృశ్యమైన ఆమహానుభావుడే నారదుడు.త్యాగయ్య నారదపంచరత్నములు రాశారు.అవి భైరవిరాగంలో" శ్రీనారద ముని గురురాయ" ,శుభాంగ కానడ లో" శ్రీనారద నాద సరసీరుహభృంగ" ,దర్బారు లో" నారదగురు స్వామీ", విజయశ్రీ రాగంలో ,"వరనారద నారాయణ " అఠాణాలో "నారదగానలోల" తో తరించాడు త్యాగయ్య. నారదసందర్శనభాగ్యం,నారదునిపై కీర్తనలు చెప్పిన ఏకైక వాగ్గేయకారుడు.శంకరభారణంలో "స్వరరాగసుధారసయుత భక్తి స్వర్గాపవర్గమురా" లో త్యాగయ్య కి సంగీత శాస్త్ర సందేహాలు పటాపంచలైనవి. 🌷
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి