1785 లో త్యాగయ్య గారు* జ్యోతిస్వరూపిణి* రాగాన్ని పాడి దీపాన్ని వెలిగించినట్లు పుదుక్కోట నిఘంటువులో ఉంది. తనగురువు శొంఠివేంకటరమణభాగవతులతో కల్సిపుదుక్కోటవెళ్లారు. అక్కడిరాజు రామచంద్ర తొండమాన్ తన ఆస్థాన సభలో దుప్పట్లో నూనె వత్తి వేసి,సంగీతంతో దాన్ని వెలిగించమన్నాడు.సంగీత విద్వాంసులంతా విఫలులైతే త్యాగయ్య హెచ్చు తగ్గులస్థాయిలో జ్యోతిస్వరూపిణి రాగంపాడుతుంటే దీపం ప్రకాశంకూడా హెచ్చి తగ్గి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.
1789లో ఆయన 20వ ఏట తండ్రి చనిపోతే,తల్లి సహగమనంచేయాలనుకుంది.కానీ భర్త మాటలు గుర్తుకొచ్చాయి" త్యాగయ్య భవిష్యత్తు చూడాలినీవే" అని .అందుకే ఆప్రయత్నం మానుకుంది. గోరుచుట్టుమీద రోకటిపోటులాగా భార్య పార్వతి చనిపోయింది. అప్పటికాయనవయసు 23ఏళ్లు.బిలహరి లో" తొలిజన్మమున చేయు దుడుకు తెలిసెను రామా" అని వాపోయాడు.కానీ భార్య కోరిక మేరకు ఆమె చెల్లెలు కమలాంబను పెళ్లాడాడు.వారికి సీతాలక్ష్మి అనే కూతురు పుట్టింది.
త్యాగయ్య ఉంఛవృత్తి తో సాధారణ జీవితం గడిపిన మహానుభావుడు.తిరువయ్యూర్ తిరుమంజనవీధిలో పిత్రార్జిత ఇంటిలో కొంత భాగం, 3 సెంట్ల భూమితో సంసారాన్ని ఈదుతూ తన ఇంటబసచేసిన శిష్యులను, సంగీత సాహిత్య పండితులనుపోషించాడు.అక్షయపాత్రను తలపై పెట్టుకుని తంబూరచేబూని శిష్యులతో, యమునాకల్యాణి రాగంలో" హరిదాసులు వెడలే ముచ్చట గని ఆనంద మాయే దయాళో
హరిగోవింద నరహరి రామకృష్ణాయని వరుసగ నామము కరుణతో జేయుచు" అని గానంచేస్తూ జీవితం గడిపారు.తూమునరసింహదాసుకూడా ఇలా ఉంఛవృత్తితో జీవయాత్ర సాగించాడు.
త్యాగయ్య మాళవశ్రీ రాగంలో"ఎన్నాళ్లు తిరిగేది,ఎన్నరాని దేహాలెత్తి ఈసంసార గహనమందు
ఉప్పుకప్పురము వరకు ఉంఛవృత్తిచే నార్జించి" అని వాపోయారు.
కానీ మంగళంపల్లి బాలమురళీకృష్ణగారు ఇలా అన్నారు" శ్రీత్యాగరాజు బీద వాడుకాడు. నిత్యపూజలు, నిరతాన్నదానాలు చేశారు.సంప్రదాయానుసారంగా ఉంఛవృత్తి సాగించారు కానీ పొట్ట కూటికోసం మాత్రం కాదు." తన అక్షయపాత్ర నిండగానే వెంటనే ఇల్లుచేరేవాడు త్యాగయ్య 🌷
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి