విఙ్ఞాన అంబుధిలో మెరిసిన పాలవెల్లి!
జ్ఙాన కాంతులు పంచిన జాబిల్లి!
విద్యా జ్యోతులు వెలిగించిన కల్పవల్లీ!
సకల విద్యలందు సాటిలేని మేటి!
మన "సర్వేపల్లి"!!🌹🌹🙏
పాండిత్య పరిమళాల ప్రతిభా మూర్తి!
అంచెలంచెలు ఎదిగిన అనన్య మేధో సంపత్తి!
విద్యార్థుల మనో రథాన్ని అధిరోహించి
రాష్ట్రపతి పీఠానికే వన్నె తెచ్చిన తేజోదీప్తి!
నిత్య చైతన్య ఙ్ఞానతృష్ణకు స్పూర్తి!
ఉపాధ్యాయ వృత్తికే మకుటాయమాన కీర్తి!
మన "రాధాకృష్ణ" మూర్తి!!🌹🌹🙏
ఙ్ఞాన భిక్షను పెట్టి జన్మనిచ్చే గురువు
బ్రహ్మ!!🙏
లోక రీతిని తెలిపి, నీతిగీతను పంచే గురువే
విష్ణు!!🙏
సర్వవిద్యలలోన సత్యమేదో తెలిపేనిత్యగురువు
మహేశ్వరుడు!!🙏
===================================================
ఎందరో గురువులు అందరికీ వందనాలు🙏🙏🙏
మిత్రులందరికి ఉపాధ్యాయ దినోత్సవ. శుభాకాంక్షలతో 🌹⚘🌺🌷🌹🌹💐💐💐🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి