ఈనోట ఆనోట ఏ నోట విన్నా ‘ఎల్ నినో’!: - -యేచన్ చంద్ర శేఖర్- మొబైల్: 8885050822


ఈనోట ఆనోట ఏ నోట విన్నా ‘ఎల్ నినో’
మరి దీని దుష్ప్రభావం ఎలా ఉండునో!!

ప్రపంచవ్యాప్తంగా ‘ఎల్ నినో’ నామ జపం 
సర్వవ్యాప్తం అయ్యింది దాని నామధేయం!! 

రెండు నుండి ఏడు ఏళ్లకోమారు ఆగమనం
యావత్ ప్రపంచాన్ని చేస్తుంది గందరగోళం!! 

పసిఫిక్ మహాసముద్రంలో ఎల్ నినో జననం
అయినా భారతదేశంలో సైతం దీని ప్రభావం!!

ఎల్ నినో వల్ల ఋతుపవనాల మందగమనం
వర్షాధార పంటలకు కలిగించునుగా ఇది నష్టం!!

వర్షాభావ పరిస్థితులతో భూగర్భ జలాలు మృగ్యం 
కరువు కాటకాలకు చేస్తుందిగా ఇది దోహదం!!  
  
ఎల్ నినో ప్రభావంతో అధిక ఉష్నోగ్రతలు సహజం
అధిక వేడిమి వల్ల వాటిల్లదా కార్చిచ్చుల ప్రమాదం!!

అకాల వరదలతో సంభవించుగా జల ప్రళయం
వరదలతో తల్లడిల్లిపోదా సాధారణ జన జీవనం!!   

గ్లోబల్ వార్మింగ్ ను అరికట్టకపోతే తప్పదు వినాశనం    
శాస్త్రవేత్తలు వేగిరమే కనుగొనాలి ఏదో తరుణోపాయం!! 

పర్యావరణ పరిరక్షణకు ధరించాలి ఒక దీక్షా కంకణం 
అభివృద్ధి పేరిట చేసే విధ్వంసానికి స్వస్తి పలకాలి సత్వరం!! 

కామెంట్‌లు