అనగనగా ఒక చిన్న ఊరు ఉండేది. ఆ ఊరిలో జ్యోతి అనే ఒక అమ్మాయి ఉండేది. జ్యోతి రోజూ పుస్తకం పట్టుకుని కూర్చుంటే చాలు, సమయం ఎలా గడిచేదో కూడా తెలియదు. చదవడం అంటే ఆమెకు చాలా ఇష్టం. నేను పెద్దయ్యాక కలెక్టర్ అవుతాను అని ఊర్లో వాళ్లందరికీ చెప్పేది. జ్యోతి చిన్నప్పుడే అమ్మా నాన్నలను కోల్పోయింది. అందుకే మేనమామ ఇంట్లో ఉంటూ చదువుకుంటూ ఉండేది. మేనమామ మాత్రం జ్యోతిని తన కూతురిలాగే చూసుకునేవాడు. కానీ అత్త మాత్రం అలా కాదు. ఉదయం లేవగానే పనులు చేయించేది. ఊడ్చడం, పాత్రలు కడగడం, నీళ్లు తేవడం అన్నీ జ్యోతికే చెప్పేది. చదువుకోడానికి టైం కూడా సరిగ్గా దొరికేది కాదు. అన్నం కూడా కొన్నిసార్లు మిగిలింది పెట్టేది. అయినా జ్యోతి ఏమీ మాట్లాడేది కాదు. ఒకరోజు నా చదువే నాకు దారి చూపుతుంది అనుకుని మౌనంగా ఉండేది. ఒకరోజు జ్యోతి వాళ్ల పెద్దనాన్న చనిపోయారు. మేనమామ ఆ చావుకు వెళ్లాడు. ఇంట్లో జ్యోతి, అత్త ఇద్దరే. అత్త జ్యోతిని పిలిచి, బజారుకు వెళ్లి బియ్యం, కూరగాయలు తీసుకురా అంది. జ్యోతి సరే అత్త అని సంచి తీసుకుని బజారుకు బయలుదేరింది. దారిలో తన స్నేహితురాలు లక్ష్మి కనిపించింది. ఎక్కడికి వెళ్తున్నావే జ్యోతి? అని అడిగింది. బజారుకు వెళ్తున్నాను. అత్త పంపించింది అని చెప్పింది. ఇద్దరూ కొద్దిసేపు మాట్లాడుకున్నారు. నువ్వు స్కూల్‌కు ఎప్పుడు వస్తావ్? అని లక్ష్మి అడిగింది.త్వరలోనే వస్తాను అని జ్యోతి చిరునవ్వుతో చెప్పింది.
బజారులో సరుకులు కొనుక్కుని జ్యోతి ఇంటికి వచ్చింది. ఒకరోజు జ్యోతి ధైర్యం చేసి మామయ్య దగ్గరకు వెళ్లింది. తáల వంచుకుని, మామయ్యా నాకు చదువుకోవాలని ఉంది. దయచేసి నన్ను స్కూల్‌కు పంపండి” అని చెప్పింది. మేనమామ కాసేపు మౌనంగా ఉన్నాడు. తర్వాత మామయ్య మెల్లిగా అన్నాడు, అమ్మా జ్యోతి సరే నువ్వు చదువుకో. నిన్ను చదివించడం నా బాధŠ్యత. ఆ మాటలు విన్న జ్యోతి ఆనందంతో కళ్లు మెరిశాయి. ధన్యవాదాలు మామయ్య అని కాళ్లకు నమస్కారం పెట్టింది.
మరుసటి రోజు మామయ్య జ్యోతిని స్కూల్‌కు తీసుకెళ్లి చేర్పించాడు. జ్యోతి కొత్త బట్టలు వేసుకుని, పుస్తకాలు చేతిలో పట్టుకుని స్కూల్‌కి వెళ్లింది. టీచర్ ఆమెను చూసి, బాగా చదువుకో తల్లి అన్నారు. జ్యోతి చదువులో ముందుండేది. ఇంటికొచ్చాక కూడా పుస్తకమే ఆమెకు స్నేహితుడు. ఆమె మార్పు చూసి అత్త మనసు కరిగిపోయింది. ఒకరోజు అత్త జ్యోతి దగ్గరకు వచ్చి,
అమ్మా నిన్ను నేను చాలా కష్టపెట్టాను. నన్ను క్షమించు అంటూ ఏడ్చింది. జ్యోతి అత్త చేతిని పట్టుకుని, అత్తా, ఏడవకండి. అని అన్నది.
ఆ రోజు నుంచి అత్త కూడా జ్యోతిని బాగా చూసుకోవడం మొదలుపెట్టింది.
నీతి:పట్టుదలతో చదువుకుంటే, ఓర్పుగా ఉంటే మన కలలు తప్పకుండా నెరవేరుతాయి.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి