జీవన సర్వస్వం.:-డా పివిఎల్ సుబ్బారావు. -విజయనగరం.-సెల్: 9441058797.
  
   

ధ్యాన మూలం, గురుమూర్తి! 
  పూజా మూలం, గురుపాదం!
   మంత్రమూలం ,గురువాక్యం!      
    మోక్షమూలం ,గురుకటాక్షం! 
     జీవన సర్వస్వం, గురువే! 

త్రిమూర్తి, స్వరూపం !
హరుడై, అజ్ఞాననాశనం!
 బ్రహ్మయై, జ్ఞానసృజనం! 
హరియై , జ్ఞానవర్ధనం! 
గురుసన్నిధి, జీవితాన పెన్నిధి!

సనాతనం/ అధునాతనం ,
      గురువే కల్పతరువు!
అతడిచ్చే అణువే ,
          మనకి మేరువు!
దీవెనతో ప్రయత్నం ,
          ఎంతో సులువు!
వరించు, నిత్యం,
     విజయాల కొలువు!
పేరు చెప్పుకుంటే,,
    పెరుగు మన పరువు!

జీవనగమ్య దూరదర్శి!
 జీవనపథ మార్గదర్శి!
అజ్ఞానాంధకార జ్ఞానరశ్మి!
జీవననైపుణ్యదాయ తేజస్వి!  
 శిష్య చేత పరాజయ మనస్వి!

మట్టి--కుండ, శిల-- శిల్పం !
నేల-- జల, కొండ-- కోవెల!
వెదురు- వేణువు ,ధనువు!
అమూర్తిని మార్చు సరిమూర్తి! 
అమ్మానాన్న- జన్మ,
          గురువే జన్మ స్ఫూర్తి!
_________
కామెంట్‌లు