నడక నేర్చిననాడు నాన్నతోడు.
చదువులకు, మా భవిష్యత్తుకు
అన్నీ మీరే (గురువు) మాకు తోడు..
మాచే అక్షరాలను దిద్దించారు.
మాలో ఆలోచనలను రేకెత్తించారు..
పలుకులు పలికించారు..
మెలకువలు నేర్పించారు..
తెలుగు మాధుర్యం రుచి చూపించారు.
ఎక్కాలు వల్లె వేయించారు.
ఎదుగుదల నేర్పించారు..
లెక్కలు చెప్పారు.
చిక్కులెక్కలు విప్పారు..
విజ్ఞాన విషయాలు తెలిపారు.
జ్ఞానాన్ని అందించారు.
సాంఘిక శాస్త్ర విషయాలు బోధించారు.
సమాజానికి సాయం చేయమన్నారు.
తప్పు చేస్తే మందలించారు.
తప్పులను సరిదిద్దారు.
క్రమశిక్షణ నేర్పారు
క్రమంగా రమన్నారు.
సక్రమంగా ఉండమన్నారు.
అక్రమాలను అడ్డుకోమన్నారు.
వినయ విచక్షణలు
చదువుతోపాటు సంస్కారం నేర్పారు.
మనిషిగా ఎలా బ్రతకాలో నేర్పారు.
పలకపై అక్షరాలు చెరిగినా..
మీరు నేర్పిన జీవిత పాఠాలు
ఎదఫలకంపై చిరస్థాయిగా ఎప్పటికీ నిలిచిపోతాయి.
నీ వాళ్ళు, లోకం "నీ వల్ల కాదు" అన్నపుడు
నీ వల్ల అవుతుందని నీ భుజం తట్టి, నీకు ప్రోత్సహించేది నీ గురువులు.
మీరు లేకుంటే మేమింత వాళ్ళం కాలేము.
మా ప్రతి విజయం వెనుక మీ కష్టం, మీ ఇష్టం, మీ దీవెనలు ఉన్నాయి.
మా అభ్యున్నతికి, అభివృద్ధికి గురువులైన మీరే కారకులు.
గురువు ఋణం తీర్చుకోలేనిది.
గురువు స్థానం మార్చలేనిది.
గురువులందరికీ శతకోటి వందనాలు, పాదాభివందనాలు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి