గురజాడ భావ కవులకు అడుగుజాడ.: - ఋష్యశృంగు ఢిల్లీ లేశ్వరరావు (ఋష్యశ్రీ)-సారవకోట -చరవాణి: 9490904976


గురజాడ భాషకు, భావ కవులకు అడుగుజాడ.
తెలుగు సాహిత్యానికి వెలుగు నీడ..
పుట్టింది రాయవరం..
తెలుగువారికి మీరు వరం..
నాటి మీ రచనలు, ప్రస్తుత సమాజానికి నేటికీ అవసరం..
వాడుక భాషకు ప్రాణం పోసిన ఘనులు.
కవితాలోకంలో మీరు అసమాన్యులు.

తెలుగు వైతాళికుడు - అక్షర హాలికుడు..
బాల్యవివాహాలను బందుపెట్టేవోయ్..
అవి చేసినోళ్లకు బొంద పెట్టావోయ్..
కన్యాశుల్కం కట్టడి చేశావోయ్..
వరకట్నం వదిలించావోయ్..
దురాచారాలను దులిపేసావోయ్
సదాచారాలను సాగు చేసేవోయ్ 

పండితుల భాష గ్రాంథికం - కొందరికే ఇది అవగతం.
వాడుక భాష వాడకం - పామరులకు హస్తగతం
జనులకు సమ్మతమని చాటావోయ్. 
వాడుక భాష వేడుక -  మొదలైంది నేడిక 
గురజాడకు తోడుగా గిడుగు వారు కూడిక..
ఆధునిక సాహిత్యానికి మీరు ఆద్యులు..
తెలుగు వారందరికీ ఆరాధ్యులు..

బొట్టు జుట్టు కొట్టు - భాష పై మీకు మంచి పట్టు 
కోరుకొండ - వాడుక భాషకు మీరే అండాదండ..
మెరుపులు - గ్రాంథిక భాష పై వేశారు అరుపులు 
మాటల మబ్బులు - భాషకు పెట్టారు డబ్బులు..
పుష్ప లాలికలు - మీ వ్రాతలలో మెలికలు..
సత్యవతి శతకము -  మీకు తెచ్చింది పతకము..
సుభద్ర - మీ రచనలు భద్రం..
ఊటీ చోద్యం ఏమి చెప్పదు -
కవులందు మీరు మేటి అని చెప్పక తప్పదు..
సుందరతర మీ నీల నగము - అద్భుత విహంగము..
నాటి మాట - నేటి రతనాల మూట 
లేవుకో మంత్రములు - మీ దగ్గర సాగవు కుతంత్రములు..
చిత్తరువుని చూడ - బహు చక్కని అద్దాల మేడ 
దేశభక్తి - తెలుగు భాషపై మిక్కిలి ఆసక్తి, కలమే మీకు ముఖ్య శక్తి ..
మనిషి - ఓ మహా మనిషి, మీరు ఋషి
దించు లంగరు -  దురాచారాలకు వంగరు..
లంగరెత్తుము - అవినీతిపై అక్షరాలెత్తుము..
ముత్యాలసరము - భాషకు  మిక్కిలి అవసరము.
మిణుగురులు - జ్ఞానకాంతితో మెరిసే గురులు మానవాళికి గురువులు. 
ప్సామవేదం - మీ మాటే వేదం, మీది హేతువాదం..
కాసులు -  మీ రచనలు తేనెల ఊసులు 
కన్యక -  కావ్య కానుక..
పసిపిల్లల జీవితాలను "పూర్ణమ్మ"లా జరగకూడదని పెద్దలకు మీరు చెప్పిన ఓ గొప్ప పాఠం. 
లవణ రాజు కల - లక్ష్యముతో సాకారమైనది మీ కల..

కామెంట్‌లు