ప్రవాస పద్య పరిమళం - 98.: - - వెంకట్ కొత్తూర్ Ashburn VA USA
అంశము: చిత్రానికి పద్యము 
విషయము: చిత్రము 
ఛందస్సు:  చంపకమాల 



చంపకమాల:

నిరతము నిన్ను కొల్తు జననీ సరసీరుహ నేత్ర వాఙ్మయీ
పరిణతి నిమ్ము, డెందమున భారతి వై వసియించి మాతరో!
పరమ దయానిధే ప్రతిభ పాటవమీయగ వేడుకొందు, నీ
చరణము తాకి వ్రాసితిని చంపకమాలను భక్తి మీరగా 

కామెంట్‌లు