పూలు రెండు పరిమళం ఒకటే
రంగు రుచి వాసనలో లేదు తేడా
ప్రకృతి వర కరుణల సంగీత సంగమం
ఆకాశంలో హరివిల్లు
ఇంట్లో ఇంద్రధనుసు సహజంగా
స్థలకాలాలు వేరువేరు నిజంగా
ఆత్మీయ అంతరంగాల భాష ఒకటే
చదువు లోకంలో ముచ్చట
ఒకటి అందమైన గాధాసప్తశతిపైన జీవకవిత
మరొకటి గంతులేసే పంచామృత ధార భవిత
ఒకటి బోధన,మరొకటి అభ్యాస సాధన
కలలు,కళలు ఆ కనులదాటి మనలేవు
ఆ బంధం నింగీనేల మధుర అభివ్యక్తి
అక్కడ ఎవరిమాట చెల్లియో చెల్లకో
తరంగాల తరతరాల డిసిప్లిన్
అది వీచే వాసన తోటగాలి లెగసీ...
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి