బాల్యంలో బడిమానిబడిపంతులు సినిమా చూసిన వేళభద్రం మాష్టారు అడిగినపుడుబాలమామ్మ పోయిందని అబద్ధం ఆడినది జ్ఞాపకమే..!!నాని గాడితో కలిసినాచారం బోనాలలో పాల్గొని ఇంటికొచ్చిన వేళనాన్నతో నారాయణనిదవాఖానా కు తీసుకెళ్ళామని చెప్పింది జ్ఞాపకమే...!!అర్దరాత్రి పన్నెండు వరకుఆనందరావు బలవంతంచేస్తేఆరువందలు పేకాటలో పోగొట్టుకుని ఇంటికెళ్ళినపుడుఅమ్మలుతో ఆఫీస్ లో అత్యంత ముఖ్యమైన పనిఅని చెప్పినది నేటికి గుర్తు.!!ఆదమరచి అందరు పడుక్కున్నవేళ వృద్ధాప్యంలోఆకలివేసి వంటిట్లోకెళ్ళిన సమయానఅబ్దుగాడి పెళ్ళాం అలికిడికి లేచి అడిగినపుడుఅబ్బే దాహం వేసిందన్నది జ్ఞాపకమే...!!మరణశయ్యపై ఉన్న భార్యతోమోహన్ పిలిచినా విదేశాల నుండి రానన్నాడన్న విషయంమరుగున పరచి మభ్యపెట్టిన సంగతిమరచిపోలేని జ్ఞాపకాలను వదలివెళ్ళిన ఘటన చూస్తే జీవితంలోనిజం మాట్లాడలేనా ?...................................
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి