అక్షర సత్యాలు :- -గద్వాల సోమన్న, ఎమ్మిగనూరు, సెల్ :9966414580

 

చూడొద్దు చులకనగా 
ఎవ్వరినీ తక్కువగా 
అందరూ సమానమే 
సృష్టించెను దైవమే 

ఉండొద్దు బద్ధకంగా 
బ్రతుకులోన భారంగా
శ్రమైక జీవనం మేలు 
ఉండొచ్చు గౌరవంగా 

పుండు మీద కారంలా 
పండు పైన పురుగులా 
ఉండరాదు జగతిలో 
వెనుకంజే ప్రగతిలో 

దారం తెగిన పతంగిలా 
గురిలేని పయనంలా 
ఉంటేనే వ్యర్థమే 
అక్షరాల సత్యమే 

కామెంట్‌లు