అమ్మ మేలి మాటలు : - -గద్వాల సోమన్న, ఎమ్మిగనూరు, సెల్ :9966414580

 

లేనోడికి అన్నము 
పెడితేనే పుణ్యము 
మంచి మంచి పనులతో 
అగును బ్రతుకు ధన్యము 

అమ్మ చేయు సేవలు 
నాన్న చూపు ప్రేమలు 
భువిలోనే శ్రేష్టము 
అసమానం త్యాగము 

ఉంటేనే విలువలు 
దక్కునోయ్! గౌరవము 
ముద్దులొలుకు పిల్లలు 
దేవుని బహుమానము 

స్వయం కృషితో గమ్యము 
చేరితేనే ఫలితము 
ఊరికే పోదు కష్టము 
దరి చేరును విజయము 

కామెంట్‌లు