సూర్యుడే ఉపాధ్యాయుడు : - -గద్వాల సోమన్న, ఎమ్మిగనూరు, సెల్ :9966414580

 

ఉదయించే సూర్యుడు 
ఉద్యమించే వీరుడు 
మహిలో ఉపాధ్యాయుడు 
భవిత నిర్మాణకుడు

పంచును విజ్ఞానము 
త్రుంచును అజ్ఞానము 
వెలిగించును బ్రతుకులు 
మురిపించును మనసులు 

గుణంలోన శ్రేష్టుడు 
అందరికీ ఇష్టుడు
విద్యార్థుల బ్రతుకున 
కనిపించే దేవుడు 

చూపుతాడు మార్గము 
చేర్చు విజయ తీరము 
మిగుల పూజనీయుడు 
కడు అభిమానపాత్రుడు 

గౌరవించు గురువును 
దొరుకునోయ్! దీవెనలు 
వారు చేయు బోధను 
గైకుంటే మేలులు 

అత్యుత్తమ వృత్తిలో 
ఉన్నవారు గురువులు 
అసమానులు సృష్టిలో 
పూజిస్తే వేల్పులు 

కామెంట్‌లు