వసుధైక కుటుంబం కావాలి!: - -గద్వాల సోమన్న, ఎమ్మిగనూరు, సెల్ :9966414580

 

బహు చిన్నది జీవితము 
చేసుకోరాదు వ్యర్థము 
నలుగురితో నవ్వుతూ 
జీవించుటయే ఘనము 

అందరితో ప్రేమగా 
చిరునవ్వులు చిందగా 
కలసి మెలసి ఉండాలి 
జీవితాన హాయిగా 

ఒకే కొమ్మ పూలలా 
ఒకే గూటి పక్షుల్లా 
ఉంటేనే గొప్పతనము 
చూడంగా చక్కదనము 

భేదాలే వీడాలి 
సమ భావం రావాలి 
వసుధైక  కుటుంబమై 
వసుధలోన బ్రతకాలి 

కామెంట్‌లు