ఈ సత్యము! తెలుసుకో!: - -గద్వాల సోమన్న, ఎమ్మిగనూరు, సెల్ :9966414580

 

చలువ రాతి మేడలో 
కలువ పూల పాన్పులో 
పరుండినా వృధా! వృధా! 
శాంతి లేక మనసులో 

సిరి సంపదల దీవిలో 
రాజు వారి కోటలో 
ఎక్కడున్నా తప్పదు 
మరణం విడిచి పెట్టదు 

ఎవ్వరూ ఆపలేరు 
ఇల జీవాన్ని కొనలేరు 
ఎన్నెన్నో సృష్టిలో 
ఈలాంటివి బ్రతుకులో 

వద్దు అహంకారమే 
ఎప్పుడూ వెటకారమే 
తెలుసుకో ఈ సత్యము 
చివరికదే ప్రమాదమే 

కామెంట్‌లు