మనం సంపన్నులం కావడం కోసం.
మనం ఎదుటి వాళ్లను ఎందుకు ప్రేమిస్తాం.
మనల్ని మనం ప్రేమించుకోవడం కోసం.!!!
మనం మందిలో ఎందుకు కలుస్తాం
మనకు మనం తోడుగా ఉండడం కోసం.
మనం ఇతరులని ఎందుకు భయపెడతాం
మనకు మనం భయపడకుండా ఉండడం కోసం.!!
మనం ఇతరుల్ని ఎందుకు నమ్ముతాం
మనల్ని మనం నమ్మడం కోసం.
మనం దేవుని ఎందుకు విశ్వసిస్తాం
మనల్ని మనం విశ్వసించడం కోసం..!!
మనం ఇతరుల కోసం ఎందుకు త్యాగం చేస్తాం
మన కోసం మనం తెగించడం కోసం..
మనం ఇతరుల్ని ఎందుకు అభినందిస్తాం
మనల్ని మనం అభినందించుకోవడం కోసం..!!
మనం ఇతరులను ఎందుకు సంతోష పెడతాం
మనల్ని మనం సంతోష పెట్టడం కోసం
మనం ఇతరుల్ని ఎందుకు గెలిపిస్తాం
మనల్ని మనం గెలవడం కోసం.....!!
మనం ఇతరులకు ఎందుకు సహాయం చేస్తాం
మనకు మనం సహాయం చేసుకోవడం కోసం
మనం ఇతరుల కోసం ఎందుకు ఏడుస్తాం
మనకోసం మనం ఏడుస్తాం...................!!
మనం ఇతరుల్ని ఎందుకు ఎదిరిస్తాం
మనల్ని మనం ఎదిరించుకోవడం కోసం.
మనం ఇతరులపై ఎందుకు బలవంతులమవుతాం.
మనపై మనం గెలవడం కోసం...............!!
మనం ఇక్కడ ఒక నిజం తెలుసుకుంటాం
కేవలం
మనకోసం మనం ఇదంతా చేస్తాం.............!!
==============================================
సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని యుపిఎస్ ఖానాపూర్ నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి