మట్టితో చేసిన వినాయక విగ్రహాలే వాడాలని, అవి నీటిలో సులభంగా కరుగునని, అలా కాకుండా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ప్రతిమలు వాడితే కాలుష్యాన్ని కల్గిస్తాయని రాజాం పర్యావరణ పరిరక్షణ సమితి అధ్యక్షులు ఆర్.వి.జె.నాయుడు అన్నారు. జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత కుదమ తిరుమలరావుకు తదితర ప్రముఖులకు మట్టితో తయారు చేసిన వినాయక విగ్రహాలను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఆర్.వి.జె.నాయుడు మాట్లాడుతూ రాజాం పర్యావరణ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా పదివేల మట్టి ప్రతిమలను, రాజాం సర్కిల్ ఇన్స్పెక్టర్ నవీన్ కుమార్ చేతులమీదుగా బహూకరించామని అన్నారు. స్థానిక నరసింహ నాయుడు జ్యూయలర్స్ ఆవరణలో వీటిని పంపిణీ చేయడంతో పాటు ఇంటింటికీ వెళ్లి కూడా ఉచిత పంపిణీ చేసామని ఆయన అన్నారు. తూర్పు కాపు సంక్షేమ సంఘం, పర్యావరణ స్పృహ కల్గిన దాతలు, సేవాసంస్థల ప్రతినిధుల సహకారంతో ఈ పదివేల మట్టి ప్రతిమలను సమకూర్చామని, వాటిని స్థానికులకు పరిసర ప్రాంతాలవార్కి ఉచితంగా బహూకరించామని ఆర్వీజే నాయుడు తెలిపారు. రంగులద్దిన సున్నం విగ్రహాల వలన నిమజ్జనం అనంతరం నీటిని కాలుష్యం చేస్తాయని ఆ నీటిని తాగిన చేపలు తదితర జీవులకు హాని కల్గునని, అంతేగాక నీటి అడుగుభాగాన ఉండే సారవంతమైన మట్టి కూడా పాడవుతుందని అన్నారు. అందువలన మట్టితో చేసిన గణపతి ప్రతిమలనే అందరూ ఉపయోగించి పర్యావరణ పరిరక్షణకై పాటుపడాలని అన్నారు
ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ప్రతిమలు వద్దు - మట్టి విగ్రహాలే ముద్దు
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి