కుండపోతగా నేలను పలకరించాయి...
రైతుల హృదయాలు పరవశించాయి...
పక్కన నాగళ్లు నాట్యమాడాయి...
చెట్టుమీద ఊరపిచ్చుకలు గుసగుసలాడాయి...
ప్రకృతి హరితవర్ణాన్ని అలదుకుంది,
చెట్లు చిగురాకుల సొగసులతో అలరారాయి...
తరువులను హరివిల్లు రంగులతో
కుసుమాలు అందంగా అలంకరించాయి...
పచ్చని పైరు కళకళలాడుతూ,
చిరుగాలికి అల్లరిగా తలలూస్తోంది...
పుడమి నిలువెల్లా తడిసి,
ఉప్పొంగులతో ఏరులై పారి,
ప్రాణికోటి దప్పికను తీరుస్తోంది...
చెరువుల గుండెల్లో జలకళ తొణికిసలాడింది,
కుంటలన్నీ నిండిపోయి కలలను మోశాయి...
జీవి మనుగడ సాగాలంటే తప్పదు,
వానమ్మ నేలతల్లిని పలకరించాల్సిందే...
ఆ చినుకే సకల జీవరాశికి జీవనాధారమై,
పుడమి ఒడిలో నిత్య జీవనగీతమై నిలవాల్సిందే!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి