సహాయం (ట ఒత్తుతో... ): - వరలక్ష్మి యనమండ్ర


చెరువు కట్ట పైన
చెట్టొకటి ఉన్నాది
చెట్టు కొమ్మ పైన
పిట్టొక్కటి ఉన్నాది //చెరువు//

పుల్ల పుడకా దెచ్చి
గూడొకటి కట్టింది
గూటిలోన పిట్ట
గుడ్లను పెట్టింది//పు//

చెర్వు కట్టమీద
చీమొక్కటి ఉన్నది
కాలుజారి చీమ
నీటిలోన పడ్డాది //చె//

చెట్టు మీద పిట్ట
చీమను చూసింది
చెట్టు ఆకు ఒకటి
నీటిలో వేసింది//చె//

ఆకును పట్టి చీమ
గట్టుకు చేరింది
పిట్టకు ధన్యవాదములు
చెప్పింది//చెరువు//

చిట్టీ చిట్టీ చెల్లెమ్మ
ట ఒత్తు నీకు తెలిసిందా
కిట్టూ, బిట్టూ రారండీ
కథలో నీతి తెలిసిందా 


కామెంట్‌లు