రాజేశ్, సతీశ్ ఓకే తరగతి చదువుతున్నారు. ఇద్దరూ ఎప్పుడూ తరగతిలో మొదటి ర్యాంకు వచ్చేవారు. ఎక్కువసార్లు సతీశ్ మొదటి ర్యాంకు వస్తే, అప్పుడప్పుడు రాజేశ్ మొదట ర్యాంకు వచ్చేవాడు. రాజేశుకు సతీశ్ మీద ఈర్ష్యాభావం. రాజేశ్ సతీశుతో మాట్లాడకపోయేవాడు. సతీశ్ ఇదేమీ పట్టించుకోకుండా తన పని తాను తీసుకుపోయేవాడు.
రాజేశ్ తన స్నేహితులతో ఎప్పుడూ సతీశ్ గురించి చెడు ప్రచారం చేసేవాడు. తరచుగా సతీశును అవమానించేవాడు. వివిధ దీంతో సతీశుకు రాజేశ్ మీద బాగా కోపం పెరిగిపోయింది. కానీ తనకు చదివే ముఖ్యం కనుక ఇవేవీ పట్టించుకోకపోయేవాడు.
ఒకరోజు రాజేశ్ క్లాస్ టీచరుతో "గురువుగారు! మేమంతా బయట ఆడుకుంటుండగా నా పుస్తకాల సంచిలో నుంచి ముఖ్యమైన స్టడీ మెటీరియల్ మాయమైంది. ఎవరో దురుద్దేశంతో, నా మీద ఈర్ష్యా భావంతో దొంగతనం చేశారు. ఆ పుస్తకం సతీశ్ తీస్తుండగా తాను చూసానని మోహన్ చెప్పాడు." అని ఫిర్యాదు చేశాడు. సతీశ్ తాను ఆ పని చేయలేదని చెప్పాడు. లేదు, సతీశే తన మీద ఈర్ష్యాభావంతో తనకు పోటీగా రాకుండా చేయాలనే దురుద్దేశంతో ఈ పని చేశాడని రాజేశ్ ఫిర్యాదు చేశారు. ఉపాధ్యాయుడు సతీశ్ మీద తీవ్రంగా మండిపడ్డాడు.
ఒకరోజు రాజేశ్ చెల్లెలు శ్రుతి "అన్నయ్యా! నా స్నేహితురాలితో నాకు పని ఉంది. వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. నా వెంట రావా." అన్నది. రాజేశ్ శ్రుతి వెంట వెళ్లాడు. ఒక పూరి గుడిసె వద్దకు తీసుకు వెళ్లింది. "నీ స్నేహితురాలు ఇంత పేద అమ్మాయా?" అన్నాడు రాజేశ్. "అవును, వారిది రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం. వాళ్లకు కడుపునిండా తినడానికే అన్నం ఉండదు. రోజు పచ్చడన్నమే తింటుంది నా స్నేహితురాలు లయ. కానీ ఎలాగైనా గట్టిగా చదువుకొని, మంచి ఉద్యోగం సాధించి, వాళ్ల తల్లిదండ్రుల కష్టాలను తీర్చాలని పట్టుదలతో చదువుతున్నారు అన్నా చెల్లెళ్ళు. అందుకే చదువులో వాళ్ళు ఎప్పుడు మొదటి ర్యాంకులో ఉంటారు." అన్నది శ్రుతి. "వాళ్ళ అన్నయ్య ఎవరు?" అని అడిగాడు రాజేశ్." "నీ క్లాస్ మేట్ సతీశ్." అన్నది శ్రుతి. రాజేశ్ చాలా బాధపడ్డాడు. ఇంత మంచివాడిపైనా తాను ఈర్ష్యాభావం పెంచుకుంది అని బాధపడ్డాడు.
రాజేశ్ సతీశ్ వద్దకు వచ్చి, తన స్టడీ మెటీరియల్ దొరికిందని చెప్పి, అనవసరంగా అపార్థం చేసుకున్నందుకు తనను క్షమించమని కోరాడు. సతీశ్ స్నేహం కావాలని ప్రాధేయపడ్డాడు రాజేశ్. "మన చెల్లెళ్ళు శ్రుతిలయలు మంచి స్నేహితులని నిన్ననే తెలిసింది. నా చెల్లెలికి ఉన్న మంచి గుణం నాలో నేను అందుకు బాధపడ్డాను. ఇకనుంచి మా చెల్లెళ్ళ లాగా మనమూ స్నేహితులం అవుదాం." అన్నాడు రాజేశ్. ఇకనుంచి ఇద్దరము కలిసి చదువుకుందామని అన్నాడు రాజేశ్. సతీశ్ ఆనందపడ్డాడు.
ప్రతిరోజు రాజేశ్, సతీశ్ కలసి చదువుకున్నారు. రాజేశ్ సతీశ్ కోసం ప్రతిరోజూ తన ఇంట్లో రకరకాల తినుబండారాలు తయారు చేయించి తీసుకు వచ్చి, ఇద్దరు కలిసి తింటున్నారు. సెలవు రోజులలో రాజేశ్ సతీశును తన ఇంటికి తీసుకువెళుతూ కలిసి ఆడుకుంటున్నారు. రకరకాల వంటలు ఇంట్లో చేయిస్తూ కలసి తింటున్నారు. రాజేశ్ తల్లిదండ్రులు కూడా సతీశును తమ కొడుకుతో సమానంగా చూసుకుంటున్నారు. శ్రుతిలయలు కూడా తరచూ కలుసుకుంటూ ఆడుకుంటున్నారు. రోజులు గడిచాయి. అన్నా చెల్లెళ్ళు మంచి ఉద్యోగాలు సాధించారు. కష్టాల నుంచి గట్టెక్కారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి