రోబోలకు శిక్షణ; - యామిజాల జగదీశ్
 

ఓ ప్రముఖ రోబోటిక్స్ సంస్థ సీఈఓ అయిన డేవిడ్ రెగర్ చెప్పిన దాని ప్రకారం, ఇంకొన్ని సంవత్సరాల్లో మనుషులు చేసే శారీరక పనులన్నీ రోబోలే చేస్తాయి. దీనికి ప్రధాన కారణం ఫిజికల్ ఏఐఐ వేగంగా అభివృద్ధి చెందడమే. చూసి, విని, స్పందించి, నేర్చుకోగల రోబోలను వీరు తయారు చేస్తున్నారు. కర్మాగారాలు, లాజిస్టిక్స్ మొదలుకొని ఇంటి పనుల వరకు అన్ని రంగాల్లో ఇది పెద్ద మార్పు తెస్తుంది.
ప్రపంచవ్యాప్తంగా వెయ్యి మందికి పైగా సెన్సార్ సూట్లు వేసుకుని పని చేస్తూ, ఆ కదలికలను డేటాగా మార్చి రోబోలకు శిక్షణ ఇస్తున్నారు. ఇలా జరిగితే రోబోలు ఒకే పని చేసే యంత్రాలు కాకుండా అన్ని పనులు సాధారణ కార్మికులుగా మారుతాయి.
కామెంట్‌లు