యశోద, కృష్ణుడి అనుబంధం: - యామిజాల జగదీశ్
 

యశోద ఇంటికి కంటికి రెప్పలాంటివాడు చిన్ని శ్రీకృష్ణుడు. 
​కృష్ణుడు చేసే అల్లరికి ఒక్కోసారి యశోదమ్మ నవ్వుకునేది.
ఇంకోసారి గద్దించేది. 
మళ్లీ ఏ లోకం నుంచి అయినా కాపాడాలని తన చీరచాటున దాచుకునేది. 
ఆమెకు కృష్ణుడు దేవుడు కాదు, తన ముద్దుల పట్టి. ఆ చిన్నికృష్ణుడి నవ్వులోనే అమ్మ లోకమంతా ఉండేది. 
​కృష్ణుడి బాల్య లీలల్లో ఎంత తియ్యదనం ఉందో, అమ్మ యశోద ప్రేమలో అంతకంటే ఎక్కువ గాఢత ఉండేది. 
సాక్షాత్తు దేవుడైనా సరే, కృష్ణుడు అమ్మ ప్రేమ ముందు తలొగ్గిపోయేవాడు. 
ఎందుకంటే ప్రేమ అనే దారపు పోగుల ముందు దేవుడు కూడా ఓడిపోతాడు. 
​ యశోద, కృష్ణుడి అనుబంధం మనందరికీ ఒకటే గుర్తుచేసేదొకటే... దేవుణ్ణి చేరుకోవడానికి పెద్ద పెద్ద యాగాలు అక్కర్లేదు, స్వచ్ఛమైన కల్మషం లేని ప్రేమ ఉంటే చాలు.


​
కామెంట్‌లు